telugu navyamedia
సినిమా వార్తలు

ఓ ప్రేమా!

priya sakhi aagamanam poetry corner
మహా యుగాల నుండీ,
మా మది  పొదరిండ్లలో
 వెలసిన మహాద్భుత 
భావనే కదా !  నీవు-
 “ఓ ప్రేమా!”
ఇష్టంలో – కాయ  కష్టంలో
అందంలో – అను బంధంలో
కష్టంలో – సుఖంలో
మాటల్లో – చేతల్లో
కళ్ళల్లో – గుండె లోగిళ్లలో 
స్వచ్ఛంగా – స్వేచ్ఛాయుతంగా
శోభించే ఆత్మీయ బంధువు
  నీవు-  
స్వాగతించే 
ప్రణయ సింధువు
నీవు-
ప్రకృతిలో –  మానవాకృతిలో
 స్త్రీ పురుషుల 
సంపూర్ణ ఊహల్లో-
నిత్యం సంచరించే
అవ్యక్త భావం నీవు
“ఓ ప్రేమా!”
 నీవే నిత్యం –
నీవే సత్యం-
ఏ కార్యమైనా 
నీకే  సు సాధ్యం
ఎన్నడూ వీడని 
నీవే  సదా పూజ్యం-
-మహేంద్రాడ సింహాచలాచార్య, టెక్కలి.

Related posts