telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంత “ఓ బేబీ” టీజర్ వచ్చేసింది

Oh-Baby

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత సరికొత్త లుక్ లో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో సమంత లుక్ ఆకట్టుకునేలా వుంది. సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.

Related posts