telugu navyamedia
సినిమా వార్తలు

సమంత “ఓ బేబీ” ఫస్ట్ లుక్

Samnatha

పెళ్ళి తరువాత సమంత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎక్కువగా ఎంచుకుంటోంది. గత సంవత్సరం విడుదలై భారీ విజయం సాధించిన “రంగస్థలం” సినిమాలో సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో గ్లామర్ తో పాటు డీగ్లామర్ పాత్రలను కూడా పండించగలదని నిరూపించింది సమంత. ఇటీవల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు “ఓ బేబీ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో సమంత యువతిగానూ, వృద్ధురాలిగాను రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో సమంత లుక్ ఆకట్టుకునేలా వుంది. సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

Related posts