telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగ చైతన్య రికార్డులకు చెక్ పెడుతున్న సమంత

samantha-chaitu again in nag movie sequel

నాగ చైతన్య, సమంత సెలెబ్రిటీ కపుల్ మాత్రమే కాదు టాలీవుడ్ లో చూడముచ్చటైన జంట. నాగచైతన్యే నా లోకమంటోంది సమంత. కానీ వెండితెరపై భర్త రికార్డులకు చెక్ పెడుతోంది సమంత. దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కించారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేశారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ నెల 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమా అంచ‌నాల‌ను అందుకుంటూ ఘ‌న విజ‌యంగా నిలిచింది. ఎమోష‌న‌ల్‌తో పాటు ప‌లు కామెడీ సన్నివేశాల‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తుంది. ఈ సినిమాలో సమంత నటనకు సినీ అభిమానులే కాక సెల‌బ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికి ఈచిత్రం మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు అమెరికాలో కూడా దుమ్ము రేపుతోంది ఓ బేబీ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జనతా గ్యారేజ్, మనం వంటి సినిమాలతో మిలియన్ డాలర్ల రికార్డులను చూపించింది సమంత. రెండో వారానికి అమెరికాలో ఓ బేబీ సినిమా 8,60,000 డాలర్లను సంపాదించింది. మరో లక్షా 40 వేల డాలర్లు ఆర్జిస్తే ఒన్ మిలియన్ మార్క్ దక్కుతుంది. అయితే ఇప్పటికే తన భర్త నటించిన ప్రేమమ్ సినిమా వసూళ్ళను దాటేసింది ఓ బేబీ. నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమా అమెరికాలో బిగ్ హిట్. ఆ సినిమా రికార్డ్‌ను అధిగమించేసింది సమంత. భర్త రికార్డ్‌ను బ్రేక్ చేయడం తెలుగు సినీపరిశ్రమలోనే కాదు అమెరికాలో కూడా ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.

Related posts