telugu navyamedia
వార్తలు సామాజిక

ప్రియురాలి ఫోన్ తో ఇంటికెళ్ళి.. అడ్డంగా బుకైన ప్రియుడు

ఫేస్ బుక్ ప్రేమలో పడ్డ ఓ ప్రియుడు ప్రియురాలి సందేశంతో ఆమె ఇంటికెళ్ళి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇద్దరు రహస్యంగా కలిసిన సమయంలో ఆమె తల్లిదండ్రులు ఇద్దరినీ పట్టుకున్నారు. గ్రామస్తుల సమక్షంలో పెళ్లి చేసేశారు. ఈ వింత ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గులునియా గ్రామానికి చెందిన ఓ యువతికి, కుబాబుపట్నా గ్రామానికి చెందిన బైకుంఠ అనే యువకుడికి ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో ఇరువురి మధ్య ప్రేమ వ్యవహారం మొదలైంది. అయితే తన తల్లిండ్రులు బయటకు వెళ్లడంతో సదరు యువతి బైకుంఠకు ఫోన్ చేసింది. “ఇంట్లో వాళ్లంతా బయటకు వెళ్లారు. నువ్వు ఇంటికి రా” అంటూ సందేశం పెట్టింది. దీంతో బైకుంఠ పట్టలేని సంతోషంతో బైక్ పై అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు. అయితే యువకుడి రాకను గమనించిన పొరుగింటి వ్యక్తి ఒకరు అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ కొట్టారు. దీంతో వీరిద్దరిని యువతి కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా అమ్మాయి కుటుంబం ఊరిముందు పంచాయితీ పెట్టింది. గ్రామస్థుల సమక్షంలో ఇద్దరికి పెళ్లి చేశారు.

Related posts