telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పూరీ నుంచి వెళ్లిపోవాలి.. ఒడిశా సర్కారు హెచ్చరిక

fog rain in himachal pradesh

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుపాను తాజాగా తీవ్ర పెనుతుపానుగా మారడంతో ఒడిశాలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అక్కడి తీరప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రఖ్యాత పూరీ పుణ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇప్పడు తీవ్ర పెనుతుపాను గండం పొంచి ఉండడంతో వాళ్లందరినీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒడిశా సర్కారు హెచ్చరికలు జారీచేసింది.

పూరీ క్షేత్రంలో గురువారంలోగా అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సహాయ చర్యలకు అడ్డంకిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఒడిశా తుపాను ప్రభావ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేశారు.ఇప్పటికే ఫణి తుపాను కేంద్రకం వద్ద గాలుల తీవ్రత 200 కిలోమీటర్లకు పైగా ఉందని సైక్లోన్ ట్రాకర్లు చెబుతున్నారు.

Related posts