telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే .. వాలంటీర్ జీతాలు..

october 1st to 5th volunteers get salaries

ఏపీఐఐసీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఆర్కే రోజా గ్రామ వాలంటీర్ల జీతాల చెల్లింపుపై ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టినట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే అక్టోబర్ 1న వాలంటీర్లకు జీతం జమ చేయనున్న వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి ఈనెల 30 వరకు జీతం చెల్లిస్తుందని చెప్పారు. 1,92,848 మంది వాలంటీర్లకు గాను విధుల్లో ఉన్న 1,85,525 మంది 1,50, 621 మందికి అక్టోబర్ 1న గౌరవ వేతనం 7,500 ల చొప్పున పంచాయతీ రాజ్ శాఖ జమ చేయనున్నట్టు తెలిపారు. సకాలంలో ధృవపత్రాలు సమర్పించని వారికి అక్టోబర్ 1 నుంచి 5 వ తేదీ లోపు గౌరవ వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖాయమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ ముందుకు పోతున్నారని స్పష్టం చేశారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేసింది తామేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పు కోవడం సిగ్గుచేటని ఏపీఐఐసీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. పాదయాత్రలో గిరిజనులకు ఇచ్చిన మాట మేరకు ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతించిన జీవోను ప్రభుత్వం నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే.

Related posts