telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజలు.. డబ్బుల వర్షం అంటూ మోసం

మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం సభ్యులు… ఒకరకమైన మూఢత్వంలోకి వెళ్లిపోయారు. ఉన్మాదభక్తితో కన్నప్రేమను మర్చిపోయారా తల్లిదండ్రులు. కడుపున పుట్టిన పిల్లల్ని… కర్కషంగా చంపేశారు. మదనపల్లి జంట హత్యల కేసులో రోజుకో ట్విస్ట్‌ చోటు చేసుకుంటూనే ఉంది. అయితే… ఈ ఘటన మరువకే ముందే పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. సమాచారం మేరకు క్షుద్రపూజల ముఠాను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. 20 లక్షలు, బంగారం ఆశ చూపి దివ్య అనే యువతిని కొనుగోలు చేయడానికి ముఠా ప్రయత్నించింది. అయితే..పోలీసుల విచారణ సరికొత్త ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. క్షుద్రపూజల వెనుక మహారాష్ట్ర పూజారి హస్తం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. బారిష్ పేరిట పూజలు చేస్తే… డబ్బులు వర్షంలా కురుస్తాయని ఆశ చూపింది మహారాష్ట్ర గ్యాంగ్. మహిళలతో పూజలు చేస్తే… డబ్బులు వర్షం కురుస్తాయనే నమ్మకంతో దివ్య అనే యువతిని ఎంపిక చేసింది క్షుద్రపూజల ముఠా. ఈ కేసులో రాజేందర్, కుమార్ ప్రధాన సూత్రధారులు కాగా.. మల్లమ్మ, సరిత పాత్రధారులుగా ఉన్నారు. పోలీసుల అదుపులో మహారాష్ట్ర పూజారితో పాటు నలుగురు నిందితులు ఉన్నారు. బారిష్ పూజ అనేది మోసం అంటున్న పోలీసులు…బారిష్ ల నిధులు కురిసేందుకి ఓ సెట్ ఏర్పాటు చేసి…రసాయనాలతో వర్షం కురిసేలా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు పోలీసులు. రసాయనాల కలయికతో వర్షంతో పాటు డబ్బులు కురిసేలా చేసి అమాయకుల నుంచి ఈ గ్యాంగ్ లక్షలు దోపిడీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts