telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

జీతం పెంచాలంటూ న్యూయార్క్‌ చట్టసభ సభ్యురాలు చేసిన పని చూస్తే షాకే…!!

Alexandra

అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ రెస్టారెంటుకెళ్లిందో జంట. పిజ్జా ఆర్డర్ ఇవ్వడానికి వెయిటర్‌ను పిలిచింది. వారి టేబుల్ వద్దకొచ్చిన మహిళా వెయిటర్‌ను చూసి వారిద్దరూ వెంటనే లేచి నిలబడ్డారు. ‘మీరు ఇక్కడున్నారేంటి’ అంటూ ఆమెను ప్రశ్నించారు. ఇంతకీ ఆమె ఎవరంటే న్యూయార్క్‌ చట్టసభ సభ్యురాలు, డెమొక్రాట్ నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్. ఆమె ఆ రెస్టారెంట్లో ఎందుకు పనిచేస్తోందో తెలుసా..? జీతం కోసం. ఆమె పనిచేస్తోంది తన జీతం కోసం కాదు. తనలా రోజువారీ జీతానికి రెస్టారెంట్లు, సెలూన్లు, కార్‌వాషింగ్ సెంటర్ల వంటి సంస్థల్లో పనిచేసే వేలమంది కార్మికుల కోసం. ఇంతకీ విషయమేంటంటే.. ఇలాంటి సంస్థలు రోజువారీ జీతానికి పనిచేసే కార్మికులకు ప్రతిగంటకూ కేవలం 2.13 డాలర్లు మాత్రమే వేతనం చెల్లిస్తున్నాయి. నిజానికి వీరు చెల్లించాల్సింది గంటకు 7.25 (సుమారు రూ.504) డాలర్లు. కానీ వారికి టిప్స్ వస్తాయనే సాకు చూపుతున్న కంపెనీలు ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వడంలేదు. ఇలా కేవలం 2.13 డాలర్లు మాత్రమే ఇచ్చి పని చేయించుకోవడం సమంజసం కాదని, బానిసత్వమని అలెగ్జాండ్రియా అన్నారు. దీనికి వ్యతిరేకంగా కనీస వేతనాన్ని గంటకు 15 డాలర్లకు పెంచాలనే ప్రతిపాదన చట్టసభ ముందు పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చేవరకూ కార్మికులకు పూర్తి వేతనం ఇవ్వాలని, టిప్స్‌ను సాకుగా చూపి జీతంలో కోతలు విధించడం అమానుషమని ఆమె పేర్కొన్నారు. 

Related posts