telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓవర్సీస్ లోను .. ఇరగదీస్తున్న ‘ఓ బేబి’ ..

Oh-Baby

ఓ బేబి చిత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. టాలీవుడ్ చిత్రాలు ఓవర్సీస్ లో విడుదల చేయడం సహజం అయినప్పటికీ, ఈ చిత్రం తన ప్రత్యేకతను చాటుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీన్ని త్వరలో బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నాం’ అని నిర్మాతలు వివేక్‌ కూచిభోట్ల, సునీత తాటి అన్నారు. సమంత, నాగశౌర్య, లక్ష్మి, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌ ప్రధాన పాత్రధారులుగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వివేక్‌ కూచిబొట్ల, సురేష్‌బాబు, సునీత, థామస్‌ సంయుక్తంగా నిర్మించారు.

నిర్మాత సునీత మీడియాతో మాట్లాడుతూ ‘సౌత్‌ కొరియన్‌ సినిమా ‘మిస్‌గ్రానీ’ నిర్మాత థామస్‌ ఇండియాలో రీమేక్‌ చేద్దామని వచ్చారు. ఆయనతో నాకు పరిచయం వల్ల తెలుగు పరిశ్రమ గురించి చెప్పి ఇక్కడ తీయాలని ప్రోత్సహించాను. అందుకు ఆయన.. సౌత్‌ ఇండియా సినిమా అని! ఆశ్చర్యంగా చూశారు. తనకు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ అనే తెలుసట. సౌత్‌లో నాలుగు భాషలు అందులో తెలుగు టాప్‌ అని వివరించి చెబితే అప్పుడు నమ్మారు. తెలుగులో అలా ఇది సెట్‌ అయింది. ఈ కథ చేసేటప్పుడు సమంత బాగా సూట్‌ అవుతుందనిపించింది. సమంతనే నందినిరెడ్డిని దర్శకురాలిగా సూచించారు. వృద్ధురాలి పాత్రని మొదట సమంతతోనే చేయిద్దామనుకున్నాం. కానీ సహజత్వం కాదని భావించి లక్ష్మీని సంప్రదించారు.

కథలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. కానీ నేటివిటీ పరమైన మార్పులు చేశారు. సమంత అద్భుతంగా చేసింది. నందినిరెడ్డి అంతే బాగా తెరకెక్కించారు. సినిమాకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. బన్నీ దీని గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమాని చైనా, జపాన్‌, వియత్నంలో విడుదల చేయాలని అడుగుతున్నారు. చైనాలో భారీ విడుదల ఉండబోతుంది. ఇప్పటికే చైనాలో రీమేక్‌ అయిన తెలుగు సినిమాను సబ్‌టైటిల్‌తో విడుదల చేయాలని అక్కడివారు అడిగారు. అలాగే కన్నడ, బెంగాలీ భాషల్లోనూ రీమేక్‌ అడుగుతున్నారు.

ప్రస్తుతం హిందీలో రీమేక్‌ చేసే ప్లాన్‌లో ఉన్నాం. సినిమాకి నలుగురం నిర్మాతలమైనా సురేష్‌బాబే అన్నీ అయి నడిపించారు. ప్రొడక్షన్స్‌ పరంగా కూల్‌గా ఎలా పని చేయించుకోవచ్చో వివేక్‌ నుంచి నేర్చుకున్నా ఈ చిత్రాన్ని బూసాస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి పంపిస్తున్నాం. త్వరలో మూడు ప్రాజెక్ట్‌లతో రాబోతున్నాం’ అని అన్నారు. వివేక్‌ చెబుతూ ‘మేం ఊహించినదాని కంటే మంచి స్పందన లభిస్తుంది. సురేష్‌బాబుతో కలిసి చేయడం వల్ల మాకు లాభాలు ఇచ్చే పని నేర్పించారు. సాధారణంగా ప్రొడక్షన్‌ అనేది చాలా కష్టమైన పని, కానీ ఆయన ఈజీగా ఎలా చేయొచ్చో నేర్పించారు. ఇంకా మున్ముందు మా ప్రొడక్షన్‌లో చాలా మంచి సినిమాలు వస్తాయి. ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీమామ’ చిత్రం 70శాతం షూటింగ్‌ పూర్తయింది. దసరాకి విడుదల చేస్తాం … అని తెలిపారు.

Related posts