telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

కేంద్ర నెహ్రూ యువ కేంద్ర సంగఠన్ లో .. ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం..

nyks recruitment notification 337 jobs

న్యూఢిల్లీలోని ఎన్‌వైకేఎస్ (నెహ్రూ యువ కేంద్ర సంగఠన్) లోవివిధ శాఖలలో ఖాళీగా ఉన్న సుమారు 337 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా. లైబ్రేరియన్, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్, వంటి పలు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీ ఖాళీలు: అసిస్టెంట్ డెరైక్టర్/డిస్ట్రిక్ట్ యూత్ కో-ఆర్డినేటర్-160, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్-17, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1, అసిస్టెంట్-38, లైబ్రేరియన్-1, కంప్యూటర్ ఆపరేటర్-4, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (ఏసీటీఎస్)-58, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2-23, లోయర్ డివిజన్ క్లర్క్-12, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-23.

అర్హత : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.

వయసు : పోస్టులను బట్టి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు చెందిన పురుష అభ్యర్థులకు రూ.700; మహిళా అభ్యర్థులకు రూ.350; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎంలకు ఫీజు లేదు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : http://nyks.nic.in

Related posts