telugu navyamedia
news telugu cinema news

నువ్వే నేనైపోయా…

nuvve nenaipoya poetry corner

నా మోము మెరుపు ల్లో ……….
నా మేని విరుపుల్లో ……..
నా పెదాల చిరునవ్వు ల్లో…..
నా కళ్ళ భావాల్లో…..
నువ్వు నిలిచిపోయా వు రా !
నా జీవిత గమనం లో….
ప్రతి క్షణం,ప్రతి విషయం…….
నువ్వైపోయావు రా !
నువ్వే నేనైపోయాను గా!
నాలో నువ్వు అన్నింటికీ ……..
మించిపోయావు అంచనాల్లో…….
నీ లో నేను నచ్చని నాడు …….
తుడిచేయకు నను నీ ఆలోచనల్లో……
నువ్వు ఉన్నావు అనే భావన…….
మది లో ఒక మధు కలశం రా !
నీవు లేని నాడు వేదన నిండిన…….
విష తుల్యం రా!
నీవు నా యెదుట ఉంటే మాటలు రావు గా……
నీవు లేకపోతే మౌనం కూడా………
భయమేస్తోంది రా ! 
నీవు నాలో ఉంటే అంతా వెలుగే……..
చుట్టూ ఏదో స్వర్గం లో ఉన్నట్టు ఉంటుంది రా !

-జె.పద్మావతి
ఆదోని.

Related posts

ప్రియుడితో కమల్ హాసన్… ఇదే ముఖ్యమట

vimala p

సర్వేలు ఎలా ఉన్నా ..మహాకూటమిదే అధికారం

vimala p

పవన్ పై పోటీకీ నేను సిద్దం: కేఏ పాల్

vimala p