telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ట్వీట్… “ఆర్ఆర్ఆర్” అప్డేట్… 

NTR
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా,  ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ కు జతగా డైసీ ఎడ్గార్ అనే విదేశీ నటి నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, సంజయ్ దత్, వరుణ్ ధావన్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. సినిమా చిత్రీకరణ విషయానికొస్తే ప్రస్తుతం ఈ చిత్రం మూడవ షెడ్యూల్ కు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని తారక్ ట్వీట్ చేస్తూ “భారీ షెడ్యూల్ కోసం వెళుతున్నాను” అంటూ హైదరాబాద్ నుంచి వడోదర ఫ్లైట్ టికెట్లను షేర్ చేశారు. దీంతో అభిమానులు హ్యాపీ జర్నీ, ఇలాగే అప్డేట్స్ ఇస్తూ ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం 2020 జూన్ 30న విడుదల కానుంది. 

Related posts