telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : సెట్స్ నుంచి ఫొటోలో పోస్ట్ చేసిన ఎన్టీఆర్

NTR

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైంద‌ని ఇటీవ‌ల మేక‌ర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా అలియా భ‌ట్‌, ఎన్టీఆర్‌కి జోడీగా ఓలివియా మోరిస్‌పై స‌నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చితాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. భారీ బ‌డ్జెట్‌తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌రకు ఒక్క లుక్ కూడా విడుద‌ల కాక‌పోవ‌డంతో సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా గ‌మనిస్తున్నారు. ఈ చిత్రం కీలకపాత్రలో నటిస్తున్న అజయ్ దేవగణ్ షూటింగ్‌లో భాగంగా వెళ్లారు. అజయ్ దేవగన్‌పై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారట. ఈ సందర్భంగా అజయ్ దేవగన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. తమ లోకంలోకి అజయ్ సార్ రావడం సంతోషంగా ఉందన్నారు. సెట్స్‌లో అజయ్ దేవగన్‌, రాజమౌళి, రామ్ చరణ్‌తో దిగిన ఫొటోలను ఎన్టీఆర్ షేర్ చేశారు.

Related posts