telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ కొత్త లుక్… షాక్ లో అభిమానులు

NTR

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్ర‌మిది. అలియా భ‌ట్‌, సముద్రఖని, అజ‌య్ దేవ‌గణ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ పాత్ర‌లో, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై దాన‌య్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు నిజ పాత్ర‌ల క‌ల్పిత క‌థాంశమే ఈ చిత్ర‌మని ఇది వ‌ర‌కే రాజ‌మౌళి తెలియ‌జేశారు. అయితే సినిమా కోసం ఏమి చేయడానికైనా ఇప్పటి యంగ్ హీరోలు సిద్ధపడుతున్నారు. సినిమా కోసం బరువు పెరగడం, అవసరమైతే ఎంతో కఠోర శ్రమ చేసి సన్నగా మారడం వంటివి చేస్తున్నారు. సినిమా సినిమాకు సరికొత్తగా కనిపించేందుకు తమ శరీరంతోనే ప్రయోగాలు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఎన్టీయార్ తాజా లుక్ ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీయార్ తాజాగా ఓ దుస్తుల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఆ బ్రాండ్ కోసం చేసిన ఒక యాడ్‌లో ఎన్టీయార్ స్టన్నింగ్ లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఎన్టీయార్ చాలా సన్నగా మారిపోయాడు. గెడ్డంతో, సన్నగా ఎన్టీయార్ చాలా బాగున్నాడని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Related posts