telugu navyamedia
telugu cinema news

ఫిబ్రవరి 22న “ఎన్టీఆర్ : మహానాయకుడు” ?

ntr biopic

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా “ఎన్టీఆర్ బయోపిక్” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తుండగా… “కథానాయకుడు”, “మహానాయకుడు” అనే టైటిల్స్ తో ఈ రెండు భాగాలు తెరకెక్కుతున్నాయి. మొదటి భాగమైన “కథానాయకుడు” చిత్రాన్ని జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను పొందింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.

ఇక రాజకీయ రంగప్రవేశం, ఆ తరువాత ఎదురైన పరిణామాలతో రూపొందుతున్న “మహానాయకుడు” చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. “మహానాయకుడు” చిత్రాన్ని ముందుగా జనవరి 24న విడుదల చేయడానికి చేయాలనుకున్నారు. ఆ తరువాత ఫిబ్రవరి 7కు సినిమా విడుదల తేదీని పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో కొత్త విడుదల తేదీ హల్చల్ చేస్తోంది. వచ్చే నెల 22న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారనేది తాజా సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రెండవ భాగంలో చంద్రబాబుగా రానా, హరికృష్ణగా కల్యాణ్ రామ్ పాత్రలు పూర్తిస్థాయిలో కన్పిస్తారు. అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Related posts

అసోం వరదబాధితులకు … అక్షయ్ భారీ విరాళం.. 2కోట్లు..

vimala p

చిలుకూరు ఫామ్‌హౌస్‌లో విజయ నిర్మల అంత్యక్రియలు

vimala p

“ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్” ట్రైలర్… అప్పుడే మొదలైన హెచ్చరికలు…

vimala p