telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఎన్టీఆర్ : కథానాయకుడు” మొదటిరోజు కలెక్షన్స్

NTR-Biopic

దివంగత నందమూరి తారకరామారావు జీవితచరిత్ర ఆధారంగా “ఎన్టీఆర్ బయోపిక్”ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగమైన “కథానాయకుడు” చిత్రాన్ని బుధవారం విడుదల చేశారు. నిన్న సినిమా చూసిన నందమూరి అభిమానులు సినిమా బాగుందంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. నిన్న “ఎన్టీఆర్ : కథానాయకుడు” చిత్రాన్ని హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు వీక్షించారు. అంతేకాదు పలువురు సినిమా ప్రముఖులు సినిమా చూసి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలిరోజు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ద్వారా మూడు కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా పదిహేను కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా తొమ్మిది కోట్ల షేర్ ని రాబట్టింది.

ఏరియాల వారిగా సినిమా మొదటిరోజు వసూళ్లు :
నైజాం – రూ. 1.75 కోట్లు
గుంటూరు – రూ. 2.05 కోట్లు
నెల్లూరు – రూ. 0.55 కోట్లు
వైజాగ్ – రూ. 0.87 కోట్లు
కృష్ణ – రూ. 0.72 కోట్లు
వెస్ట్ – రూ. 0.45 కోట్లు
ఈస్ట్ – రూ. 0.50 కోట్లు
సీడెడ్ – రూ. 2.11 కోట్లు

Related posts