telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఎన్ .టి రామారావు రాజకీయ ప్రవేశం …తరువాత ఏమి జరిగిందంటే …?

NTR Gari Political Entry
మహానటుడు ఎన్ .టి . రామారావు గారు సినిమా రంగాన్ని వదిలి రాయకీయ రంగంలో ప్రవేశించారు . 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీకి ప్రకటించారు . అదొక సంచలనం . ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో నూతన అధ్యాయం మొదలైంది . రాష్ట్రంలో వేళ్ళు పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీ మహావృక్షాన్ని రామారావు గారు కూల్చేస్తానని ప్రతిన పునాడు . 
ఆ సందర్భంగా జరిగిన ఓ సంఘటన ఇది .  . 
1982 మార్చి 31వ తేదీ  బుధవారం . అప్పుడు మా ఆంధ్ర జ్యోతి కార్యాలయం . సెక్రటేరియట్ ఎదురుగా మేడ మీద ఉండేది . ఆరోజు నేను ఆఫీసుకి కొంచం ఆలస్యంగా వెళ్ళాను . అప్పటికే రెండు మూడు ఫోన్లు వచ్చాయని ఆఫీస్ బాయ్ చెప్పాడు. . నేను ఆ రోజు షూటింగ్ లు ఏమున్నాయో కనుక్కుంటున్నాను. .అప్పుడే ఫోన్ మ్రోగింది . 
“జ్యోతి మంత్లీ నుంచి గాంధీ ని మాట్లాడుతున్నా “అన్నాడు . “గాంధీగారు మీరేనా ….. నాకోసం ఫోన్ చేసింది ?”అని అడిగాను . “అవును నేనే  చేశాను ” అన్నాడు . “చెప్పండి గాంధీ గారు “”ఎన్ .టి .రామారావు గారు  తెలుగు దేశం పార్టీ ని ప్రకటించారు కదా , వారి ప్రత్యేక  ఇంటర్వ్యూ జ్యోతి మంత్లీ లో పబ్లిష్ చేద్దామని అనుకుంటున్నాము . ఆ ఇంటర్వ్యూ మీరు చేసిపెట్టాలి “అన్నారు . “నేనా ? ఎలా కుదురుతుంది ? ఆఫీస్ అనుమతి కావాలిగా ?”అన్నాను . 
NTR Gari Political Entry
“నేను విజయవాడ బిజినెస్ మేనేజర్ వెంకటేశ్వర్లు గారితో మాట్లాడతాను “అన్నారు . “సరే మీరు మాట్లాడండి ” అనిచెప్పాను గాంధీ గారి నాన్న రాఘవయ్య గారు ఆంధ్ర జ్యోతి కి మొదట జనరల్ మేనేజర్గా పనిచేశారు . ఆ తరువాత ముళ్ళపూడి వెంకటరమణ , బాపు గారి సలహాతో 1962లో జ్యోతి మాస పత్రిక ప్రారంభించారు . అతి తక్కువ కాలంలోనే జ్యోతి పత్రిక పాఠకుల ఆదరణ  సంపాదించింది . 
రాఘవయ్య గారు చనిపోయాక శ్రీమతి లీలావతి రాఘవయ్య మేనేజింగ్ ఎడిటర్ గా పత్రికను అదే వరవడిలో , అదే స్థాయిలో తీసుకు వస్తున్నారు . రాఘవయ్య , శ్రీమతి లీలావతి గారికి ఇద్దరు పిల్లలు . గోపి , గాంధీ . చిన్న కుమారుడు గాంధీ తల్లికి సహాయంగా జ్యోతి మాస పత్రిక వ్యవహారాలు చూస్తున్నారు . గాంధీ గారు ప్రసిద్ధ దర్శకులు కె. హేమాంబరధర రావు గారి అల్లుడు . హేమాంబరధర రావు గారి చిన్న అమ్మాయి అనురాధ ను గాంధీ వివాహం చేసుకున్నాడు . ఎన్ . టి .రామారావు గారితో “ఆడపడుచు ” , “కథానాయకుడు ” చిత్రాలను హేమాంబరధరరావు  డైరెక్ట్ చేశారు. 
ఆ రకంగా రామారావు గారంటే గాంధీ గారికి ప్రత్యేకమైన అభిమానం వుంది . ఒక అరగంట తరువాత గాంధీ గారు ఫోన్ చేసి వెంకటేశ్వర్లు గారితో మాట్లాడాను , మీకు మెసేజ్ రావచ్చు … రామారావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ  ప్లాన్ చేద్దాము , డిటైల్డ్ గా చేద్దాము , అన్నట్టు మీతో పాటు ఫోటోగ్రాఫర్ ని తీసుకు రండి “అని చెప్పాడు . 
విజయవాడ నుంచి బిజినెస్ మేనేజర్ వెంకటేశ్వర్లు గారి నుంచి టెలీ ప్రింటర్  మెసేజ్ వచ్చింది . అప్పుడు రామారావు గారితో వుండే ఎన్ . ఎస్ .ప్రసాద్ గారికి ఫోన్ చేశాను . “రామారావు గారి ఇంటర్వ్యూ చాలా కష్టం … “అని చెప్పారు . అయితే ఆ తరువాత ఏమైందంటే ….. . 

Related posts