telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన యంగ్ టైగర్ ఫ్యాన్స్

ntr

ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో సెలెబ్రిటీలతో సహా అభిమానులు కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతున్నారు. దీంతో తమ అభిమాన హీరోల సినిమాల యానివర్సరి ట్రెండ్ ట్యాగ్ లతోను, బర్త్ డే ట్రెండ్ ట్యాగ్ లతో రికార్డ్స్ సృష్టిస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ బ‌ర్త్‌డే కావ‌డంతో కొద్ది రోజుల ముందు నుండే హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్ అనే హ్యాష్ ట్యాగ్‌తో వ‌రుస ట్వీట్స్ చేశారు. 21.5 మిలియ‌న్లకి పైగా నెటిజ‌న్స్ ఈ ట్యాగ్ తో ట్వీట్స్ చేయ‌గా ఇదొక రికార్డ్ అని తెలుస్తుంది. ఎన్టీఆర్ తాజాగా ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో న‌టిస్తుండ‌గా, ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్‌కి సంబంధించిన వీడియో ఏదైన వ‌స్తుంద‌ని ఫ్యాన్స్ భావించారు. కాని లాక్‌డౌన్ వ‌ల‌న వారి ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి. ఇక సోషల్ మీడియాలో ఈ మధ్యన కొన్ని ట్యాగ్ లతో ట్రెండ్ చేస్తూ అభిమానులు రికార్డు సృష్టిస్తున్నారు. హీరోలు త‌మ సినిమాల ద్వారా రికార్డు కలెక్షన్ల‌తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్యాగ్ లతో ట్రెండ్ చేసి రికార్డులు సృష్టిస్తున్నారు.

Related posts