• Home
  • Trending Today
  • “ఎన్టీఆర్” బయోపిక్ : రెండు భాగాలకూ ఒకే ధర… నష్టపోయే అవకాశం ఉందంటున్న బయ్యర్లు
Trending Today సినిమా వార్తలు

“ఎన్టీఆర్” బయోపిక్ : రెండు భాగాలకూ ఒకే ధర… నష్టపోయే అవకాశం ఉందంటున్న బయ్యర్లు

NTR-Biopic

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ‘బయోపిక్’ క్రిష్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తుండగా, చంద్రబాబుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, ఎన్టీఆర్ భార్య బసవతారకంగా విద్యా బాలన్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలిభాగాన్ని’ఎన్టీఆర్ కథానాయకుడు’గా, రెండో భాగాన్ని ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా రూపొందిస్తున్నారు. అంతేకాదు ఆ రెండు భాగాల విడుదల తేదీని కూడా ప్రకటించారు. 9 జనవరి 2019న మొదటిభాగం, 24 జనవరి 2019 రెండో భాగం విడుదలవుతుందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలోనే ట్రేడ్ సర్కిళ్లలో కూడా ఎన్టీఆర్ బయోపిక్‌పై మాంచి క్రేజీ ఏర్పడింది. ఈ సినిమాను తీసుకునేందుకు బయ్యర్లు ఎగబడుతున్నారు టాక్ ఇంతకుముందు విన్పించింది. కేవలం పక్షం రోజుల వ్యవధిలోనే ఈ చిత్రం రెండు భాగాలను విడుదల చేస్తామని ప్రకటించిన నిర్మాతలు ఈ రెండు భాగాలకు ఒకటే ధరను నిర్ణయించడంతో బయ్యర్లు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారని సమాచారం.

ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగంలోనే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నట్లుగా, రెండో భాగంలో అంతా రాజకీయం చుట్టూ తిరుగుతుందని ఇండస్ట్రీవర్గాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి భాగంపై ఉన్న క్రేజ్ రెండో భాగంపై ఉండకపోవచ్చుననీ… అది కూడా పక్షం రోజుల వ్యవధిలోనే రెండు భాగాలు విడుదల అవుతుండడం వల్ల బయ్యర్లు లాస్ అవుతారని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనడం గమనార్హం. రెండు భాగాలకు కూడా ఒకటే ధర నిర్ణయించడం సరికాదని సదరు డిస్ట్రిబ్యూటర్ చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ బయోపిక్ రెండుభాగాల ఫార్ములాతో దెబ్బేననే టాక్ మొదలైంది. మొత్తానికి “ఎన్టీఆర్” బయోపిక్ లో ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.

Related posts

సీబీఐని ఆయుధంలా వాడుకుంటున్న ప్రధాని..! రాహుల్ గాంధీ విమర్శలు

nagaraj chanti

ప్రజాస్వామ్య పుట్టింటిని తాకిన మీటూ…మహిళల పట్ల 200 మంది

nagaraj chanti

‘సుబ్రహ్మణ్యపురం’ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ 

chandra sekkhar

Leave a Comment