telugu navyamedia
telugu cinema news trending

ఎన్టీఆర్ బయోపిక్ : పెథాయ్ ఎఫెక్ట్… ఆడియో విడుదల వాయిదా

ntr biopic

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొదటి భాగమైన “కథానాయకుడు” చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాతలు. దీంతో సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టారు చిత్రబృందం. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం నుంచి ఆసక్తికరమైన పోస్టర్లు, పాటలు విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన రెండు పాటలకు కూడా మంచి స్పందన లభించింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ హైద‌రాబాద్ లో… ఆడియో రిలీజ్ ఈవెంట్ నంద‌మూరి తార‌క‌రామారావు పుట్టిన ఊరు నిమ్మ‌కూరులో జ‌ర‌గ‌నున్నాయని, డిసెంబ‌ర్ 16న ట్రైల‌ర్ లాంచ్.. 21న ఆడియో వేడుక నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు.

కానీ ఇప్పుడు ఆడియో ఈ వేడుకని వాయిదా వేసినట్లు సమాచారం. బాలకృష్ణ స్నేహితుడు బొర్రా గాంధీ ”నిమ్మకూరు వేదికగా ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమాల్ పెథాయ్‌ తుఫాన్‌ కారణంగా రద్దైంది. ఈ వేడుకని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తాం” అంటూ ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుగా ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలుగా వ‌స్తుంది. జ్ఞాన‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. విద్యాబాల‌న్, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్, ర‌కుల్ ప్రీత్ సింగ్, లెజెండ‌రీ కైకాల స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Related posts

అఖిల్ పై హైపర్ ఆది పంచులు 

ashok

పొలిటికల్.. క్యాస్టింగ్ కోచ్, ..మంత్రి.. మంత్రితో..

vimala p

టోల్ వద్ద క్యూ లో 20 వాహనాలు ఉంటె.. లైన్ క్లియర్, నో టోల్ ఫ్రీ ..! : కేసీఆర్

vimala p