telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్’‌ రిలీజ్ డేట్‌ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

rrr

కరోనా ఎఫెక్ట్‌తో మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభమౌతాయో తెలీక నిర్మాతలు తలలు పట్టుకొంటున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’‌కి గట్టి దెబ్బే తగిలింది. షూటింగ్ వాయిదా పడటంతో షెడ్యూల్ మొత్తం తారుమారైంది. అసలే ఇప్పటికే విడుదల తేదీని వాయిదా వేసి జనవరి 8, 2021న తప్పక విడుదల చేస్తాం అని ప్రామిస్ చేశారు రాజమౌళి. అయితే దాదాపు ఒక నెల పాటు షూటింగ్‌కి లాంగ్ గ్యాప్ రావడంతో ఈ సినిమా వాయిదా పడటం ఖాయమే అని వార్తలు వస్తుండగా దీనిపై క్లారిటీ ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించిన సమయానికే (జనవరి 8, 2021)విడుదల చేస్తామన్నారు నిర్మాత డీవీవీ దానయ్య.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తైందని పూణె షెడ్యూల్‌లో బాలీవుడ్ హీరోయిన్ ఆలియ భట్ జాయిన్ అవుతుందని తెలిపారు. ఇటీవల ఈమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుందన్న వార్తలపై ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు నిర్మాత. ఆమె ఇచ్చిన డేట్స్ ప్రకారం ఏప్రిల్ నెలలోనే షూటింగ్ చేయాల్సి ఉందని అయితే లాక్ డౌన్ నేపథ్యంలో డేట్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పూణే తరువాత యూనిట్ మొత్తం డెహ్రాడూన్ వెళ్తుందనే అక్కడే ఏకధాటిగా షూటింగ్ జరుగుతుందని చెప్పారు దానయ్య. విఎఫ్‌ఎక్స్ వర్క్ స్పీడుగా జరుగుతోందని ఈ విరామ సమయంలోనూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయంటూ ఆర్ఆర్ఆర్ చిత్రంపై వస్తున్న రకరకాల రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత డీవీవీ దానయ్య.

Related posts