telugu navyamedia
సినిమా వార్తలు

మలైకాతో ప్రేమాయణం… ఫైర్ అయిన అర్జున్ కపూర్ సోదరి

Arjun-Kapoor

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా మధ్య ప్రేమాయణం గురించి వారిద్దరే ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ విషయం కాస్తా బాలీవుడ్‌‌లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మలైకా కంటే అర్జున్ కపూర్ వయసులో 12 ఏళ్లు చిన్నవాడు. ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగగా… మలైకా ఘాటుగా స్పందించింది. అయితే అర్జున్ కపూర్ ఎఫైర్ వల్ల అతడి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరి ఎఫైర్ గురించి ఆ మధ్యన అనిల్ కపూర్ కు కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. తాజాగా అర్జున్ కపూర్ సోదరికి మీడియా నుంచి మలైకాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. మలైకా, అర్జున్ కపూర్ రిలేషన్ షిప్ గురించి మీడియా అర్జున్ సోదరి అన్షులాని ప్రశ్నించింది. దీనితో అన్షులా మీడియాపై ఫైర్ అయ్యింది. తన సోదరుడి జీవితాన్ని ఆమెతో ముడిపెట్టి ప్రశ్నలు అడగొద్దు. ఆ విషయం గురించి నాకు తెలియదు. మా అన్న నాకు తండ్రి లాంటి వాడు. నా సోదరుడితో ఇలాంటి విషయాలు నేను ఎలా చర్చిస్తాను అని అన్షులా మీడియాని ప్రశ్నించింది. మలైకా అరోరా తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. అంతేకాదు వీరిద్దరికీ పెళ్ళి చేసుకునే ఆలోచన కూడా లేదట.

Related posts