telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఏకంగా 6 కోట్లు ఎగనామం పెట్టాడు… ఏం చేశాడంటే ?

New couples attack SR Nagar

యూకేలో ఓ ప్రముఖ ఫుడ్ కంపెనీని మోసం చేసి కరణ్ చోప్రా (30) అనే ఎన్నారై దాదాపు రూ. 6 కోట్లు కాజేశాడు. ఇండియాలో ఉన్న రోహిత్ జైన్ అనే స్నేహితుడితో కలిసి కరణ్ ఈ మోసానికి పాల్పడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కరణ్, రోహిత్ ఇద్దరూ ఇండియాలోని జెన్‌పాక్ట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. చోప్రా యూకే వచ్చి బిజినెస్ అండ్ ఫైనాన్స్‌లో గ్రాడ్యూయేషన్ చేసి ఫుడ్ కంపెనీలో కమర్షియల్ అనలిస్ట్‌గా చేరాడు. హోల్‌సేల్ కస్టమర్ల ద్వారా సేల్స్ పెంచడం.. వారికి ఉత్పత్తులపై రాయితీలను ఇవ్వడం ఇది కరణ్ చేయాల్సిన పని. అయితే కరణ్ మాత్రం ఇండియాలో ఉన్న తన స్నేహితుడు రోహిత్‌తో కుమ్మక్కై ఓ నాలుగు నకిలీ కంపెనీలను, నకిలీ అకౌంట్లను స్థాపించాడు. ఇద్దరూ ఒకరికి ఒకరు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ.. ఫుడ్ కంపెనీకి ఆ డబ్బును చెల్లించినట్టుగా సిస్టమ్‌ను డివైజ్ చేశారు. ఆ నకిలీ కంపెనీలు, నకిలీ అకౌంట్లకు కంపెనీ నుంచి కొన్నేళ్ల పాటు 6.5 లక్షల పౌండ్లు(దాదాపు రూ. 6 కోట్లు) పంపించాడు. కరణ్ ఉద్యోగం మానేసిన కొన్ని నెలల తర్వాత కంపెనీ యాజమాన్యానికి జరిగిన నష్టం గురంచి తెలిసింది. కరణ్ కాజేసిన సొమ్మును తిరిగి కంపెనీకి చెల్లించాలని, తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కంపెనీ యూకే కోర్టులో కేసు వేసింది. అయితే కరణ్ మాత్రం తనపై చేసిన ఆరోపణలు తప్పని నిరాకరిస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించిన తీర్పు త్వరలో వెలువడనుంది.

Related posts