telugu navyamedia
రాజకీయ

మాతృభాష‌ల్లో ఇంజ‌నీరింగ్ కోర్సులు..!

వైద్య విద్యా కోర్సుల‌కు సంబంధించి కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకుంది. మెడిక‌ల్ అండ్ డెంట‌ల్ ఎడ్యుకేష‌న్ (యూజీ, పీజీ)లో ఓబిసి, ఈడ‌బ్ల్యూఎస్ వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తున్న‌ట్లు మోదీ ప్ర‌క‌టించారు. దేశంలో పేద మ‌రియ‌ వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ఉన్న‌త విద్యను మ‌రింత స‌మ‌ర్ధ‌వంతంగా అందించాల‌నే ఉద్దేశంలోని భాగంగా, హిందీ, త‌మిళం, తెలుగు, మ‌రాఠీ, బెంగాలీ స్థానిక భాష‌ల్లో విద్య అందించేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు.

దేశంలో సామాజిక న్యాయంలో కొత్త ఆధ్య‌య‌నం మొద‌లైంద‌ని, ఈ దేశ యువ‌త ఆశ‌యాల‌కు ఈ నూత‌న విద్యావిధానం అండ‌గా నిలుస్తుంద‌ని చెప్పారు. నూత‌న విద్యా విధానం ద్వారా యువ‌త‌కు దేశం పూర్తిగా త‌మ వెంటే ఉంద‌ని భ‌రోసా ఇచ్చారు. మాతృభాష‌ల్లో విద్య‌ను అందించ‌డం దీంట్లో అత్యంత కీల‌కం. విద్యార్ధుల్లో ఉండే అన‌వ‌స‌ర ఒత్తిడి దూరం చేస్తుంద‌ని చెప్పారు.

2021, 2022 విద్యాసంవ‌త్స‌రం నుంచి ఈ రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తిస్తుంద‌ని మోదీ ప్ర‌క‌టించారు. ఈ దేశ యువ‌త మార్పుకు సిద్ధంగా ఉన్నార‌ని, వారి క‌ల‌లు నేర‌వేర్చ‌డాని ఈ దేశం అండంగా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. కాగా.. క‌రోనా కార‌ణంగా విద్యావ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా మారిన‌ప్ప‌టికీ విద్యార్ధులు అన్‌లైన్‌లో చ‌ద‌వ‌డం అల‌వాటు చేసుకున్నారని అన్నారు.

Related posts