telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కేథడ్రల్‌ చర్చికి ఒక్కరోజులోనే వేలకోట్ల విరాళాలు

Notre-Dame-Church

ప్రాన్స్ రాజధాని పారిస్ లో ఉన్న పురాతన నాట్రడామ్‌ కేథడ్రల్‌ చర్చిలో సోమవారం సంభవించిన అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. 12వ శతాబ్ధంలో నిర్మించిన ఈ ప్రార్థనా మందిరం చాలావరకు ధ్వంసమైంది. 800 సంవత్సరాల నాడు ఎంతో శ్రమించి నిర్మించి, ఏసుక్రీస్తు ధరించిన ముళ్ల కిరీటాన్ని భద్రపరిచిన చర్చ్ ఇప్పుడు నామరూపాల్లేకుండా పోయింది. అయితే ప్రమాదం జరిగిన ఒక్క రోజు వ్యవధిలోనే ఈ చర్చి పునర్నిర్మాణానికి రూ.6,941 కోట్ల నిధులు సమకూరాయి. ఈ ప్రమాదాన్ని పెను విషాదంగా అభివర్ణించిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మేక్రాన్‌.. ఐదేళ్లలో ఈ చర్చిని పునర్నిర్మిస్తామని, అందుకోసం అంతర్జాతీయంగా విరాళాలు సేకరిస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాధారణ భక్తులతోపాటు వ్యాపార దిగ్గజాలు విరివిగా విరాళాలు ఇచ్చారు. మేక్రాన్‌ బుధవారం ప్రత్యేక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు.

కాగా కేథడ్రల్ చర్చ్ ని అగ్నికీలలు చుట్టు ముట్టడానికి నిమిషాల ముందు తీసిన ఓ ఫోటో వైరల్ గా మారింది. ఓ తండ్రి తన కుమార్తెను ఆడిస్తుండగా, అక్కడే ఉన్న బ్రూక్ విన్ డ్సర్ అనే యువతి దీన్ని క్లిక్ మనిపించింది. అంతకుముందే ఆమె చర్చ్ ని సందర్శించి బయటకు వచ్చింది. ఆపై ఈ ఫోటో తీసి, దీన్ని ఆయనకు చూపించి, షేర్ చేసుకోవాలని భావించింది. ఈలోగానే మంటలు ఎగసిపడటంతో అందరూ చెల్లాచెదురయ్యారు. ఇక ఈ ఫోటోను అతనికి ఎలాగైనా చేర్చాలన్న ఆలోచనలో ఉన్న బ్రూక్ విన్ డ్సర్, “ట్విట్టర్… నీలో మ్యాజిక్‌ ఉంటే ఈ ఫోటో అతని కంటపడేలా చెయ్యి” అంటూ ట్వీట్ చేసింది. ఆపై నిమిషాల వ్యవధిలోనే రెండు లక్షలకు పైగా రీట్వీట్లు, నాలుగు లక్షలకు పైగా లైక్‌ లు వచ్చేశాయి. ఇంకా ఈ ఫోటోను అతను చూశాడో ఇంకా తెలియలేదు.

Related posts