telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సాయంత్రం వరకూ నామినేషన్ల స్వీకరణ సాగనుంది.

వైఎస్సార్‌సీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్‌ వేసే అవకాశం ఉంది. కోలగట్ల వీరభద్రస్వామి మధ్యాహ్నం 3.30 గంటలకు నామినేషన్‌ వేయనున్నట్లు సమాచారం.

సోమవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరుగుతుందని స్పీకర్‌ ఇదివరకే ప్రకటించారు. బలాబలాల రిత్యా డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు సమర్పించారు. వెంటనే స్పీకర్ తమ్మినేని ఆ రాజీనామాను ఆమోదించారు. ఈ సమావేశాల్లో మరో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.

సామాజిక సమీకరణాల కారణంగా కోన రఘుపతిని రాజీనామా చేయాలని సీఎం జగన్ కోరినట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొన్ని పదవుల్లో మార్పుచేర్పులుచేయాలనుకున్నారు.

ఇటీవలే ఏపీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించారు. చీఫ్ విప్‌గా శ్రీకాంత్  రెడ్డిని తొలగించి ప్రసాదరాజును నియమించారు

Related posts