telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

మహిళా ఆర్మీ .. ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం… త్వరపడాలి..

notification for women army

ఆర్మీలో ఉమెన్ మిలటరీ ఫోర్సు ని బలోపేతం చేయడానికి మహిళలని కూడా రక్షణ రంగంలో కి తీసుకోవాలని భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నియామక ప్రకట చేసింది, ఇప్పటివరకూ కేవలం ఆఫీసర్ కేడర్ వరకు మాత్రమే మహిళలని తాజాగా సోల్జర్ జనరల్ డ్యూటీ ఆఫీసర్ ర్యాంక్ కు దిగువ శ్రేణిలోను మహిళలని నియమిస్తోంది. అందుకుగాను ముందుగా 100 మంది మహిళలని నియమించుకోవాలని ఉద్యోగ ప్రకటన జారీ చేసింది.

పోస్టు : సోల్జర్ జనరల్ డ్యూటీ (ఉమెన్ మిలటరీ పోలీస్).
ఖాళీల సంఖ్య: 100.

అర్హతలు : కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : 17 1/2 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. (1998, అక్టోబర్ 1 నుంచి 2002, ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి).

ఎత్తు : కనీసం 142 సెం.మీ. ఉండాలి. అందుకుతగ్గ బరువు ఉండాలి.

ఎన్‌సీసీ/ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు వయసు, ఎత్తుకు సంబంధించి ఎలాంటి సడలింపులేదు.

ఎంపిక ప్రక్రియ :

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ అనంతరం నిర్దేశిత కటాఫ్ మార్కులు నిర్ణయించి పరిమిత సంఖ్యలో తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. ఇందుకోసం పదోతరగతి మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన వారికి మాత్రమే తదుపరి దశ ఎంపిక ప్రక్రియ కోసం అడ్మిట్ కార్డులను జారీచేస్తారు. ఎంపికై న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ర్యాలీ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది.

ఆర్మీలో మహిళల నియామకానికి సంబంధించి అంబాల, లక్నో, జబల్‌పూర్, బెల్గం, షిల్లాంగ్‌లో నియామక ర్యాలీలు చేపడుతుంది. ర్యాలీకి ఎంపికైన వారికి ఈ-మెయిల్ ద్వారా అడ్మిట్ కార్డులను పంపిస్తారు.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టులో భాగంగా నిర్వహించే 1.6 కిలోమీటర్ల పరుగును 7 నిమిషాల 30 సెకన్లలో పూర్తిచేయాలి. అలానే 10 ఫీట్ల లాంగ్‌జంప్, మూడు ఫీట్ల హైజంప్‌లో అర్హత సాధించాలి.

సర్వీస్‌మెన్, ఎక్స్‌సర్వీస్‌మెన్ పిల్లలకు, యుద్ధభూమిలో వీరమరణం పొందిన సైనికుల భార్యలకు వయసు, దేహాదారుఢ్య పరీక్షల్లో సడలింపు ఉంటుంది.

పరీక్ష :

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో అర్హత సాధించిన, మెడికల్‌గా ఫిట్‌గా ఉన్న అభ్యర్థులకు నిర్దేశిత ప్రాంతంలో కామన్ ఎంట్రెన్‌స ఎగ్జామినేషన్ (సీఈఈ) ఉంటుంది.

ఈ పరీక్షలో రుణాత్మక మార్కులు ఉంటాయి. సర్వీస్‌మెన్, ఎక్స్‌సర్వీస్‌మెన్ పిల్లలకు, వితంతువులకు నిబంధనల మేరకు బోనస్ మార్కులు కేటాయిస్తారు.

విధులు :
మహిళా మిలిటరీ పోలీస్‌కు ఎంపికైన వారికి బెంగళూరులో శిక్షణ ఉంటుంది. అనంతరం వీరిని వేర్వేరు ప్రాంతాల్లో ఉండే కార్పస్ ఆఫ్ మిలిటరీ పోలీస్ (సీఎంపీ)లలో ఆఫీసర్ ర్యాంకుకు దిగువ శ్రేణిలో నియమిస్తారు. ప్రస్తుతం సీఎంపీలలో ముగ్గురు చొప్పున మహిళా ఆఫీసర్లు విధులు నిర్వర్తిసున్నారు. వారికి సబార్డినేట్స్‌గా వీరు పనిచేయాల్సి ఉంటుంది.

నేరాలకు సంబంధించి ప్రాథమిక విచారణలు జరపడం, క్రమశిక్షణ, నిఘా ఉంచటం, మిలిటరీ ట్రాఫిక్ నియంత్రణ, సెర్‌మోనియల్ విధుల నిర్వహణ, ఆర్మీకి సంబంధించిన కేసుల విచారణలో ఆఫీసర్లకు సహాయపడటం, కంటోన్మెంట్, ఆర్మీ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లలో పోలీసింగ్ చేపట్టడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ – జూన్ 8.

దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ర్యాలీ తేదీ, వేదికను అడ్మిట్ కార్డు ద్వారా తెలియజేస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : http://joinindianarmy.nic.in

Related posts