telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఉత్తర కొరియాకు భారత్ టీబీ మందుల సరఫరా!

Tablets

ఉత్తర కొరియాకు భారత ప్రభుత్వం టీబీ వ్యాధి నిరోధక ఔషధాలను సరఫరా చేయనుంది. ప్రస్తుతం అక్కడ కాశ్య వ్యాధి సంబంధిత ఔషధాల కొరత నెలకొంది. దీంతో ఆ దేశానికి ఔషధాలు పంపి, సాయం చేయాలంటూ భారత్‌నుడబ్ల్యూహెచ్‌వో కోరింది. ఆ వినతిపై భారత్ సానుకూలంగా స్పందించింది.

సుమారు మిలియన్ డాలర్ల విలువైన టీబీ మందులను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేస్తూ ఉత్తరకొరియాలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వినతి మేరకు ఔషధాలను పంపుతామని పేర్కొంది.

Related posts