telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నాన్ వెజ్ .. ఆలయం.. ప్రసాదాలు అన్నీ అవే..

non veg temple in tamilanadu

భారతదేశం ఆలయాలలో ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నన్ని దేవాలయాలు మరెక్కడా ఉండవు. అయితే.. ఆ రాష్ట్రంలోని మధురై ప్రాంతంలో ఉన్న మునియాండి స్వామి ఆలయానికి మరెక్కడా లేనంత విశిష్టత ఉంది. లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి, చివరకు బిస్మిల్లా బాత్ కూడా ఆలయాల్లో ప్రసాదంగా అందిస్తుండటం మనం చూశాం. కానీ ఏకంగా మాంసాహారాన్ని ఆలయాల్లో ప్రసాదంగా అందిస్తారా.? అంటే ఇలాంటి కొన్ని వింతలు కూడా ఉంటాయన్నది సత్యం.

మునియాండి స్వామి ఆలయంలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలే ప్రసాదాలు. గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇక్కడ ఇదే ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి 24 నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. వారి కోసం 1000 కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఇదే ప్రసాదంగా అందిస్తారు. అంతేకాదు, ఆ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉండటం గమనార్హం.

Related posts