• Home
  • వార్తలు
  • చంద్రబాబుతో సహా..16 మందికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

చంద్రబాబుతో సహా..16 మందికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు

Chandrababu Naidu Mark On Congress List

బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కలిసి 40 మంది టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ సరిహద్దులు దాటి మహారాష్ట్రలోకి ప్రవేశించి బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు బృందాన్ని అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. చంద్రబాబు సహా 16 మందిపై ధర్మాబాద్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 21న కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. చంద్రబాబుపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కనున్నాయి. కోర్టు నోటీసులు జారీ చేసిన వారిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమ, టి.ప్రకాశ్ గౌడ్, నక్కా ఆనందబాబు, గంగుల కమలాకర్, కేఎస్ఎన్ఎస్ రాజు, చింతమనేని ప్రభాకర్, నామా నాగేశ్వరరావు, జి.రామానాయుడు, సీహెచ్ విజయరామారావు, ముజఫరుద్దీన్ అన్వరుద్దీన్, హన్మంత్ షిండే, పి.అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, ఎస్. సోమోజు, ఏఎస్.రత్నం, పి.సత్యనారాయణ శింబు ఉన్నారు.

Related posts

వారు చెప్పడం వల్లే ‘అరవింద సమేత’ క్లైమాక్స్ మారింది

jithu j

కేసీఆర్ తొలి జాబితా(105)లో మార్పులు…పేరుంది అని ప్రచారం చేయట్లేదట…

chandra sekkhar

దిగులెందుకే వాన!

jithu j

Leave a Comment