telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

నోకియా 8.1 పై .. భారీ తగ్గింపు ధరలు.. త్వరపడాలి..

nokia 8.1 price dropped

నోకియా 8.1 మోడల్ 4జీబీ వేరియంట్‌పై ఆ మొబైల్ తయారీ సంస్థ భారీ తగ్గింపును ప్రకటించింది. గత జూన్ నెలలో కూడా సంస్థ 4జీబీ+64 జీబీ, 6జీబీ+125జీబీ వేరియంట్ల ధరలను తగ్గించింది. నోకియా 8.1ను రూ. 26,999 ప్రారంభ ధరతో హెచ్‌ఎండీ గ్లోబల్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఇది(4జీబి+64జీబి) రూ.15,999లకు లభించనుంది. దీనితోపాటు 6జీబీ+125జీబీ ధర కూడా తగ్గనుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 4జీబీ+64జీబీ వేరియంట్ పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్‌కార్డును వినియోగించి అదనంగా మరో 5శాతం రాయితీని పొందవచ్చు.

నోకియా 8.1 ఫీచర్లు :

* 6.18 అంగుళాల హెచ్‌డీ+ తాకే తెర
* డ్యుయల్‌ కెమెరా సెటప్‌. 12+13మెగాపిక్సెల్‌ వెనుక కెమెరాలు
* ముందువైపు 20మెగాపిక్సెల్‌ కెమెరా
* స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌
* 4జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
* 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 18వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌

Related posts