telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

నోకియా 2.2 .. అదిరిపోతున్న ఫీచర్లు.. బడ్జెట్ లోనే..

nokia 2.2 released in India

నోకియా మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. నోకియా 2.2 ఇండియా మార్కెట్లో విడుదలైంది. టంగస్టన్ బ్లాక్ అండ్ స్టీల్ కలర్లలో ఈ ఫోన్ యూజర్లను ఎట్రాక్ట్ చేసేలా ఉంది. చౌకైన ధరకే నోకియా అందిస్తున్న ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే. 5.71 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లేతో పాటు రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. నోకియా 2.2 మోడల్ స్మార్ట్ ఫోన్ లో 13MP రియర్ కెమెరా, హెలియో A22 SoC ప్రాసిసర్ ఎట్రాక్టీవ్ గా ఉన్నాయి. నోకియా 2.2 స్మార్ట్ ఫోన్ పై తక్కువ ధరతో జూన్ 30 వరకు కంపెనీ ఆఫర్ అందిస్తోంది.

తొలి వేరియంట్ (2GB +16GB) స్టోరేజీ కేవలం రూ.6వేల 999కే కంపెనీ ఆఫర్ చేస్తోంది. మరో వేరియంట్ (3GB +32GB) స్టోరేజీతో ధర రూ.7వేల 999కే అందిస్తోంది. ఈ ఆఫర్ తర్వాత నోకియా 2.2 రెండు వేరియంట్లు రూ.7వేల 699, రూ.8వేల 699 ధరకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇండియా మార్కెట్లో నోకియా అందించే నోకియా 2.2లో మోస్ట్ సెక్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ ఆండ్రాయిడ్ వన్ తో తీసుకోస్తోంది. ప్రపంచంలో కంటే ముందుగా ఇండియాలోనే తొలిసారిగా నోకియా 2.2 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ ఫోన్ అన్ని మొబైల్ రిటైల్ స్టోర్లు, నోకియా, ఈ కామర్స్ వెబ్ సైట్లు ఫ్లిప్ కార్ట్ లో జూన్ 11 నుంచి అందుబాటులో ఉండనుంది. జూన్ 6 నుంచి జూన్ 10 వరకు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. జియో యూజర్లు నోకియా 2.2 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే.. వారికి రూ.2వేల 200తో పాటు 100GB అదనంగా డేటాను అందిస్తోంది.

nokia 2.2 released in Indiaనోకియా 2.2 ఫీచర్లు :

* 5.71 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లే
* ఫేస్ రికగ్నైజేషన్ 5MP కెమెరా, టీయర్ డ్రాప్ నాచ్
* మీడియా టెక్ హెలియా A22 చిప్ సెట్
* సింగల్ ఫ్లాష్ 13MP సెన్సార్
* AutoHDR, లో లైట్ ఇమేజ్ ఫ్యూజన్
* ఆండ్రాయిడ్ 9 పై OS, ఆండ్రాయిడ్ Q అప్ డేట్

Related posts