telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఛపాక్ : ఆకట్టుకుంటున్న “నాక్ జాక్” వీడియో సాంగ్

Chapaak

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ ప్రధాన పాత్రలో నటించిన బయోపిక్ “ఛపాక్”. ఆ బయోపిక్ ఎవరిదంటే ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ అనే అమ్మాయిది. పెళ్లి తర్వాత దీపిక నటించిన మొదటి సినిమా ఇది. మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేశారు. విక్రాంత్ మస్సే దీపిక ప్రియుడి పాత్రలో నటించారు. ఇందులో ఆమె యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో నటించారు. దిల్లీకి చెందిన లక్ష్మీ అగర్వాల్ అనే యువతిపై 2005లో యాసిడ్ దాడి జరిగింది. ప్రేమ‌ని నిరాక‌రించింద‌నే కోపంతో 14 ఏళ్ళ క్రితం ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌పై యాసిడ్ దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. యావత్ భారతదేశం ఈ దాడితో దద్దరిల్లింది. యాసిడ్ దాడి జరిగినప్పుడు లక్ష్మి వయసు పదిహేనేళ్లు. ప్రేమించమంటూ వెంటపడిన ఓ కుర్రాడు లక్ష్మిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కోలుకున్న లక్ష్మి దేశంలో యాసిడ్ అమ్మకాలు ఆపాలంటూ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈమె జీవితాధారంగానే ‘ఛపాక్’ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులో దీపికా .. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్రలో ఒదిగిపోయింది. మాల్తీ అనే పాత్ర‌లో చ‌క్క‌ని న‌ట‌నా ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చింది. ఇక తాజాగా చిత్రం నుండి “నాక్ జాక్” వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. గుల్జార్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్‌ని సిద్ధార్ద్ మ‌హదేవ‌న్ ఆల‌పించారు. శంక‌ర్ ఎసాన్ లాయ్ సంగీతం అందించారు. ఈ పాట ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. పద్మావత్ తర్వాత దీపికా న‌టిస్తున్న ఛ‌పాక్ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న రిలీజ్ కానుంది.

Related posts