telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆస్కార్‌ గెలిచిన తర్వాత బాలీవుడ్‌ నన్ను దూరం పెట్టింది… సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి

Pookutty

సుశాంత్ ఆత్మహత్యతో బాలీవుడ్ లో నెపోటిజం అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. చాలామంది ప్రముఖులు నెపోటిజం వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు ఏదో ఒక రంగంలో ఆస్కార్ గెల్చుకుంటే అంతకు మించిన శాపం మరొకటి లేదని సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి వ్యాఖ్యానించారు. “ఆస్కార్‌ గెలిచిన తర్వాత బాలీవుడ్‌ నన్ను దూరం పెట్టింది. ఎవ్వరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను. నా ముఖం మీదే నువ్వు మాకు అవసరం లేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేసారు రసూల్. ఈ క్రమంలో సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ కూడా బాలీవుడ్ పై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ‘‘నా దగ్గరకు వచ్చిన ఏ మంచి సినిమానీ నేను కాదనను. కానీ నా వెనకాల ఒక గ్యాంగ్‌ ఉందనిపిస్తోంది. ఆ ముఠా నా గురించి లేనిపోనివి చెప్పి, నా దగ్గరకు రావాలనుకున్నవాళ్లను రానివ్వడంలేదని నా ఫీలింగ్‌’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌.

Related posts