telugu navyamedia
సామాజిక

ప్రేమికుల రోజు వేడుకలు అడ్డుకుంటాం.. ఏబీవీపీ 

lovers
ప్రేమికుల రోజు ను అడ్డుకుంటామంటూ.. ఏబీవీపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అబిడ్స్‌ ఏబీవీపీ జోనల్‌ ఇంఛార్జి గంధం నరేందర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 14 న వాలెంటైన్స్‌ డే పేరుతో యువతీ యువకులు పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే.. వారిని అడ్డుకొని పెళ్లిళ్లు చేస్తామని హెచ్చరించారు. ప్రేమికుల రోజు భారతీయ సంస్కృతి కాదని పేర్కొన్నారు. యువతీ యువకులందరూ కలిసి ప్రేమికుల రోజును బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Related posts