telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షూటింగ్ అయిపోయిన తరవాతే హనీమూన్ : హీరో నిఖిల్

nikhil

యంగ్ హీరో నిఖిల్ భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మను పెళ్లాడబోతున్నారు. ఏప్రిల్ 16న వీరి వివాహం జరగబోతోంది.అయితే ‘కార్తికేయ 2’ సినిమాతో బిజీగా ఉండటం వల్ల పెళ్లికి ముస్తాబవడంపై దృష్టి పెట్టలేకపోతున్నాని నిఖిల్ అంటున్నారు. ఈ మేరకు హైదరాబాద్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ పేర్కొన్నారు. 2014లో వచ్చిన ‘కార్తికేయ’కు సీక్వెల్‌ మొదలుపెట్టాం. మరోవైపు పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయి. కానీ, ప్రస్తుతానికి నేను పూర్తిగా సినిమాపైనే దృష్టి పెట్టాను. మేం ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాబోయే రెండు మూడు నెలల్లో నాది చాలా క్లిష్టమైన పరిస్థితి’’ అని నవ్వుతూ అన్నారు నిఖిల్. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు హనీమూన్‌కు కూడా వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు నిఖిల్ చెప్పారు. ‘‘నా పెళ్లి కోసం షూటింగ్ నుంచి కేవలం వీక్ ఆఫ్ మాత్రం తీసుకోగలను. దురదృష్టవశాత్తు, మా హనీమూన్ కూడా సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిన తరవాతే ఉంటుంది’’ అని నిఖిల్ వెల్లడించారు. . ప్రస్తుతం ‘కార్తికేయ 2’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోందని చెప్పారు. ‘కార్తికేయ’తో పోలిస్తే ఈ సినిమాలో నేను ఎదుర్కొనే సవాళ్లు బాగా పెద్దవిగా ఉంటాయి. పురాణాలకు సంబంధించిన ఒక అంశాన్ని ప్రస్తుత కాలానికి ముడిపెడుతూ మేం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. దీని కోసం ఆరు నెలలపాటు పరిశోధన చేసి చిత్రాన్ని పట్టాలెక్కించాం అని నిఖిల్ చెప్పారు. పరిశోధనలో భాగంగా తమ చిత్ర యూనిట్ కాంచీపురంలోని వరధరాజా పెరుమాల్ ఆలయం, గుజరాత్‌లోని ద్వారకా ఆలయం, ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం, కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలను సందర్శించి అక్కడి వేదాలను చదివి స్క్రిప్ట్ తయారు చేసిందని నిఖిల్ తెలిపారు. 5వేల ఏళ్ల క్రితం నాటి ఎన్నో మనకు తెలియని రహస్యాలను ఈ సినిమా చెబుతుంది. అని నిఖిల్ చెప్పుకొచ్చారు.  

Related posts