telugu navyamedia
study news

బాలురతో మాట్లాడొద్దు..వీర్ సురేంద్రసాయి యూనివర్శిటీ వివాదాస్పద నోటీసు

SURENDHRA SAI UNIVERSITY NOTICE
సంబాల్‌పూర్ : వీర్ సురేంద్రసాయి యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ వైస్ ఛాన్సలర్ కళాశాల విద్యార్థినులకు వివాదాస్పద నోటీసు జారీ చేసిన ఘటన సంచలనం రేపింది. కళాశాల బాలికలు రోడ్లపై అబ్బాయిలతో మాట్లాడరాదని వీర్ సురేంద్రసాయి యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ వైస్ ఛాన్సలర్ జారీ చేసిన నోటీసులో ఆదేశించారు. యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ జారీ చేసిన నోటీసును రోహిణి బాలిక హాస్టల్ లో బోర్డుపై పెట్టారు. కళాశాల హాస్టల్ అమ్మాయిలు బయటి యువకులతో మాట్లాడితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వీసీ హెచ్చరించారు. బాలురతో మాట్లాడవద్దని వీసీ జారీ చేసిన ఫత్వాపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాము కళాశాల బాలికల భద్రత కోసమే వైస్ ఛాన్సలర్ బాలురతో మాట్లాడవద్దని ఆదేశించారని ప్రొఫెసర్ పీసీ స్వైన్ వివరించారు. 

Related posts

చదువు  కోసం పణంగా మానం.

ashok

20 శాతం ఇంజినీరింగ్ ఫీజులు బాదడానికి సిద్ధం అయిన ప్రభుత్వం…

ashok