telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వ్యాపార వార్తలు

ఎండలకు .. చల్లని బీర్ ల విక్రయాలు .. భారీగా పెరిగి.. ‘నో స్టాక్‌’ బోర్డులు..

early taking alcohol causes diseases

తీవ్రమైన ఎండలు .. వేడితో చల్లని ప్రాంతాలను ఎంచుకుంటున్నారు ప్రజలు. మందుబాబులు మాత్రం ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు తెగ తాగేస్తున్నారు. ఎండాకాలం ముదరడంతో గ్రేటర్‌లో మద్యం దుకాణాలు, బారుల్లో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వారం రోజులుగా బీర్ల కొరత ఏర్పడింది. చాలా దుకాణాల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు పెట్టేస్తున్నారు. నీటి కొరత కారణంగా బీరు ఉత్పత్తిదారులు చేతులెత్తేశారని దుకాణదారులు వివరిస్తున్నారు. ఈ ఏడాది ఎండలు విరామం లేకుండా తీవ్రతను చూపిస్తున్నాయి. మందుబాబులు మద్యం కంటే ఎక్కువగా బీర్లు తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

గ్రేటర్‌లో మద్యం దుకాణాల్లో గత వారం, పది రోజుల్లో బీరు నిల్వలన్నీ ఖాళీ అయ్యాయని నిర్వాహకులు వివరిస్తున్నారు. నెలకు 60 లక్షల బీరు కేసుల డిమాండ్‌ ఉంటే ఉత్పత్తి మాత్రం సగమే ఉంటోందని వ్యాపారులు వివరిస్తున్నారు. ధరలు పెంచి విక్రయాలు.. మద్యం దుకాణాలు, బారుల్లో బీర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఒక్కో సీసాకు రూ.20 నుంచి రూ.30మేర పెంచి విక్రయిస్తున్నారు. బెల్టు షాపులకు విక్రయించి అదనపు ధరలతో అమ్ముతున్నారు. కొరత ఏర్పడటానికి సరఫరా తగ్గిపోవడమే కారణంగా కనిపిస్తోంది. బీర్లను ఉత్పత్తి కంపెనీలకు నీటి కొరత ఏర్పడింది. ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా అరకొరగానే ఉండటంతో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి ఉండటం లేదు.

Related posts