telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

విమానంలో సిగరెట్ తాగరాదు.. మరి అక్కడ యాష్ ట్రే ఎందుకో ..!

no smoking in flights but ash tray in toilets why

ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో పొగతాగడం నిషిద్ధం అని అందరికి తెలిసిందే. విమానాల్లో సిగిరెట్లు తాగకూడదు అనేది కఠినమైన నిబంధన కూడా… అటువంటప్పుడు మరి విమానాల్లో యాస్ట్రేలు ఎందుకు ఉంటాయి? మీరు ఎప్పుడైనా విమానం ఎక్కినప్పుడు వాష్‌రూంలో యాస్ట్రేను గమనించారా? మీరు గమనించకున్నా.. ప్రతి విమానంలోని వాష్‌రూమ్స్‌లో యాస్ట్రేలు ఉంటాయి. విమానాల్లో పొగతాడగమే నిషిద్ధం అయినప్పుడు యాస్ట్రేలతో పనేంటి.. అంటారా? అక్కడే మీరు పప్పులో కాలేశారు. పొగతాడగం నిషేధమే కానీ.. ఎవరు ఊరుకుంటారు చెప్పండి. వందలో ఒక్కరు ఖచ్చితంగా విమానంలో పొగతాగడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ పొగతాగుతూ దొరికితే వాళ్లకు ఫైన్ వేయడం లేదా అరెస్ట్ కూడా చేస్తారు.

వాష్ రూంలో ఒకవేళ యాస్ట్రే లేకపోతే.. వాళ్లు దొంగచాటుగా సిగిరెట్ తాగి దాన్ని డస్ట్‌బిన్‌లో వేస్తారు. అది మంటలు వ్యాపించడానికి అవకాశం అవుతుంది. దాని వల్ల విమానానికి పెద్ద ప్రమాదమే సంభవిస్తుంది. అందుకే… యాస్ట్రేలను పెడతారు. విమానాల్లో యాస్ట్రేలను అమర్చాలని చట్టం కూడా చెబుతోంది. చట్టప్రకారం విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఖచ్చితంగా యాస్ట్రేలను అమర్చాల్సిందే. ఒకవేళ అవి చెడిపోతే 72 గంటల్లో వాటిని రిపేర్ చేయించాలట. గత మార్చిలో ఇండిగో విమానంలో గోవా నుంచి డిల్లీ వెళ్తున్న ఓ ప్రయాణికుడు రెస్ట్ రూంలో సిగిరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతుంటాయి. మొత్తానికి నియమాలు పాటించడం కంటే, ప్రమాదమని తెలిసినా సిగరెట్ తాగటం మాత్రం మానట్లేదు పొగరాయుళ్లు.

Related posts