telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణాలో రెవెన్యూ శాఖ రద్దు.. జూన్ నుండే అమలు !!

CM KCR Phone opposition Leaders
తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ రద్దు కాబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇంతకాలం అధికారుల నుంచి ఈ మాటలు వినిపించగా.. తాజాగా ముఖ్యమంత్రి నోటినుంచే పరోక్షంగా వినిపించాయి. ఫేస్‌బుక్‌లో ఓ రైతు పెట్టిన పోస్టుపై ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. జూన్‌ తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం, దీనితో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ వారు సమ్మె చేస్తారంటూ వ్యాఖ్యానించడంతో వీటికి మరింత బలం చేకూరినట్లయింది. 
ఒక్క రెవెన్యూనే కాకుండా రిజిస్ట్రేషన్ల శాఖను కూడా మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. నాలుగేళ్ల కిందట ఈ ప్రతిపాదన రాగా తాజాగా అమలు దిశగా కఠినంగా ప్రభుత్వ అడుగులు పడుతున్నాయి. ‘సారూప్యం ఉన్న శాఖలన్నీ కలిపేస్తాం… ధ్రువీకరణ పత్రాలు (సర్టిఫికెట్ల) వ్యవస్థను రద్దు చేస్తాం’ అని సీఎం కేసీఆర్‌ ఇటీవల చేసిన ప్రకటన దీనికి బలాన్ని చేకూర్చింది. ఆదాయం సమీకరించే శాఖగా పేరున్న రెవెన్యూ ప్రస్తుతం భూపరిపాలనకు మాత్రమే పరిమితమయింది.

Related posts