telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

క్యూ లేకుండా .. స్మార్ట్ కార్డు తో ఏటీవీఎం నుండే .. టిక్కెట్లు..

no queue for railway ticket booking

రైలు టికెట్ల కోసం గంటల తరబడి నిరీక్షించే ప్రయాణకుల సౌకర్యార్థం తీసుకొచ్చిన ATVM మెషిన్‌కు ఆదరణ పెరుగుతోంది. బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు పనిలేకుండా..సులువుగా టికెట్లు పొందుతున్నారు. ఎంఎంటీఎస్ ద్వారా ప్రయాణం చేసే ప్యాసింజర్లు ఎక్కువగా ఏటీవీఎం కార్డులను వినియోగిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్ (ఏటీవీఎం) ఏర్పాటు చేషశారు. టికెట్లు తీసుకొనేందుకు ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులను గమనించి ఈ మిషన్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే ఏర్పాటు చేసింది. ఏటీవీఎం స్మార్ట్ కార్డులను కూడా ప్రవేశపెట్టింది. సంబంధింత రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్‌లో ఆధార్ కార్డు జిరాక్స్ అందచేయాల్సి ఉంటుంది.

రైల్వే అధికారులు నిర్వహించే రిజిస్టర్‌లో సంతకం చేస్తే స్మార్ట్ కార్డు ఇస్తారు. దీని ధర రూ. 100 నుంచి రూ. 1000కి పైగా ఉంది. ఎంత మొత్తమైనా చెల్లించి రీ ఛార్జీ చేయించుకోవచ్చు. తమకు కేటాయించిన పాస్ వర్డ్ ద్వారా ఏటీవీఎంలో స్కాచ్ చేసి టికెట్ పొందవచ్చు. దీనికి సంబంధించిన ఛార్జీ సొమ్ము కార్డులో కట్ అవుతుంది. రీ ఛార్జీ సమయంలో ప్రయాణీకులకు మూడు శాతం కమీషన్ అందుతుంది. ఏటీవీఎం స్మార్ట్ కార్డు ద్వారా అన్ రిజ్వర్వుడు టికెట్లు కొనుగోలు మాత్రమే చేస్తున్నారు. భవిష్యత్‌లో టికెట్లు రిజర్వేషన్ చేయించుకొనే అవకాశాన్ని కల్పించేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది.

Related posts