telugu navyamedia
business news health news political Technology trending

ఇప్పుడు కాలు నొప్పి .. 2020లో వైద్యమట.. క్యూ అలా ఉంది మరి..

no proper arrangements in govt hospitals

దేశంలో అన్నిచోట్లా కొరత ఉంది, కానీ అంతా సజావుగానే ఉంది, అంటూ చెప్పుకుతిరుగుతున్నారు నాయకులు. వాళ్ళు చెప్పేది గొర్రెల మాదిరి వింటున్న ప్రజలు కూడా.. వాటిలాగానే తలఊపి ఊరుకుంటూ, తమ పని తాము చూసుకుంటున్నారు. ఎంతో నైపుణ్యం, సిబ్బంది పెరిగినా ఇంకా దేశంలో చాలా ప్రాంతాలలో కనీస సౌకర్యాలు లేవనేదానికి ఇవన్నీ చక్కటి ఉదాహరణలే. కొందరికి కనీస అవసరాలైన నీరు, విద్యుత్, వైద్యం, విద్య లాంటివి కూడా కనీసం అత్యవసర స్థితిలో కూడా అందించలేకపోతున్నాయి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా. ఈ విషయం ఇలా ఎందుకు ఉంటుంది.. అనే ఆలోచన మాత్రం ప్రజలలో ముఖ్యంగా యువతలో రావడంలేదు. అందరిలాగానే వారు కూడా ఈ పరిస్థితులు ఇంతే అంటూ.. సర్దిచెప్పుకుని.. ఒక నిర్లిప్త స్థితిలో బ్రతికేస్తున్నారు. ఇది దేశానికి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది.

తాజాగా కాలు నొప్పిగా ఉందని ఒక వ్యక్తి వైద్యుడి వద్దకు పరీక్ష నిమిత్తం వెళ్ళాడు. పరిశీలించిన వైద్యుడు ఎమ్మారై స్కానింగ్ చేయించుకొని రమ్మని పంపాడు. సరే అని ఆటగాడు స్థానికంగా ఉన్న స్కానింగ్ సెంటర్ కు వెళ్ళాడు. అయితే అక్కడి సిబ్బంది అతడికి 15 ఫిబ్రవరి, 2020 కి రావాలని అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నొప్పిగా ఉందంటే, అప్పుడెప్పుడో రమ్మంటారేంటని ఆ వ్యక్తి బాధతోనే కాళ్ళీడ్చుకుంటూ వెనక్కివెళ్లిపోయాడు. దీనిగురించి సిబ్బందిని నిలదీయగా, తన వద్ద ఉన్న వస్తు సామర్థ్యంతో రోజు 12-15 మందికే స్కానింగ్ చేయగలనని, కానీ వైద్యులు రోజుకు 50-60 మందిని పంపిస్తున్నారని, అందుకే దాన్ని బట్టే అపాయింట్మెంట్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇదంతా విదేశాలలో ఎక్కడో జరిగింది కాదు, మన ముంబై లోని నాయర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. అన్నివిధాలా అభివృద్ధి చెందింది అని చెప్పుకునే నగరంలో ఒక ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉందని నేటి యువతకు ఎంతమందికి తెలుసు. దీనిని గురించి ఎవరు, ఎవరిని ప్రశ్నించగలరు…

Related posts

అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కడుతున్నాం: కేసీఆర్

vimala p

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించండి.. లేదంటే ఆందోళనకు దిగుతాం.. : మోహన్ బాబు

vimala p

చెడు కొవ్వును .. కరిగించే ఆహారం ఇదే.. !

vimala p