telugu navyamedia
రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

క్రిప్టో కరెన్సీ : .. భారత్ లో నిషేధం లేదు.. బిల్లు పాస్ అయితే జైలుకే..

no prohibition on crypto currency in india

కేంద్ర ప్రభుత్వం బిట్ కాయిన్ తరహా ఇతర క్రిప్టో కరెన్సీ విధానాలపై తమ వైఖరి వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో క్రిప్టో కరెన్సీపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. ఆర్బీఐ, ఈడీ, ఐటీ వంటి ఆర్థిక సంబంధ వ్యవస్థలు క్రిప్టో కరెన్సీపై వారి నియమావళికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరణ ఇచ్చారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆయన పైవిధంగా బదులిచ్చారు. ఇప్పటికైతే, క్రిప్టో కరెన్సీ నియంత్రణకు, క్రిప్టో కరెన్సీ వినియోగంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి ఎలాంటి చట్టం లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఇటువంటి కరెన్సీ పై కేంద్రం తీసుకువచ్చిన ముసాయిదా బిల్లు కార్యరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక కార్యకలాపాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్రగార్గ్ పేర్కొనగా, ఆ బిల్లు సిద్ధం కానందునే క్రిప్టో కరెన్సీపై ఎలాంటి నిషేధాజ్ఞలు విధించలేదని మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. గతేడాది బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు చేసే సంస్థలకు సేవలు నిలిపివేయాలంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకురాదలచిన ముసాయిదా బిల్లు కార్యరూపం దాల్చితే, క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు జరిపిన వాళ్లకు 10 ఏళ్ల నాన్ బెయిలబుల్ జైలుశిక్ష తప్పదు.

Related posts