telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ సాంకేతిక సామాజిక

#బెడ్ రూమ్ లోకి .. మొబైల్ వద్దు బాబు.. చెపితే వినండి.. ఛాలెంజ్..

#no mobile into bed room challenge

‘#బెడ్ రూమ్ లోకి మొబైల్ వద్దు’ .. ఈ ఛాలెంజ్ ట్రెండ్ అవుతుంది. ఊరికే అవట్లేదు, ప్రయోజనాలు పొందుతున్నారట అందుకే విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ అదేమిటి అనుకుంటున్నారా.. అందరికి ఉపకరించేది, కానీ తీరా తెలిశాక, మా వల్ల అయ్యేపనికాదులే అని పక్కన పెట్టేయకండి. ముందు కనీసం ఒక వారం ప్రయత్నించి చూడండి.. బాగుంది అనిపిస్తేనే రోజు అనుసరించండి. ఇంతకీ ఈ ఛాలెంజ్ లో చేయాల్సింది ఏమటంటే, మొబైల్ ని రాత్రి పడుకోబోయే ముందు పక్కన పెట్టేయాలి.. మళ్ళీ పొద్దున్న లేవగానే గంట తరువాతే మొబైల్ పట్టుకోవాలి, ఇంతే.

అనుకుంటాం కానీ, ఇంత చిన్న పని చేయలేమా, అయితే ప్రయత్నించండి.. చూద్దాం. ఒక్కరోజు, రెండు రోజులు, మూడురోజులు.. ఒక వారం రోజులు. ఎలా ఉందొ మీకు మీరు పరీక్షించుకోండి. ఒకరోజు చేసి, తరువాత రోజు మరిచిపోతే, మళ్ళీ మొదటి నుండి లెక్కపెట్టాలండోయ్! ఇంత చిన్నపని చేయలేమా అనుకుంటున్నారు చాలా మంది, తీరా మొబైల్ కాసేపు చేతిలో లేకపోతే పిట్స్ వచ్చినోడిలా కొట్టుకుంటున్నారు.. తెలుసా.. అంత కష్టం ఈ ఛాలెంజ్.

అయితే ప్రయత్నించిన వారు మాత్రం తమకు చాలా హాయిగా ఉందని, మొబైల్ లేని రోజులలో ఇంత హాయిగా ఉండేదని తడుముకోకుండా చెప్పేస్తున్నారు. దీనివలన నిద్ర లేమి, మతిమరుపు, శ్రద్ద పెట్టలేకపోవటం లాంటి అనేక సమస్యలు ఇట్టే మాయమైపోతున్నాయంట.. తెలుసా. చూశారా ఒక్క పిల్ల కాకి మొబైల్ ఇన్నాళ్లు ఎంత బాధపెట్టిందో.. ఏమండోయ్ ఇది వయోభేదం లేకుండా అందరు పాల్గొనే ఛాలెంజ్. ఆరోగ్యం అందరికి అవసరం కదా మరి!! రోజు ఒక గంట మొబైల్ పక్కన పెడితేనే .. ఇంత ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఏమండోయ్, మీరు పాటించి బాగుంటే, మరో ఐదుగురికి ఈ ఛాలెంజ్ ఇవ్వండి, పర్లేదు ఇవ్వండి, మీ సొమ్మేమీ పోతుంది గాని, మహా అయితే మీకే వాళ్ళు ఒక థాంక్స్ పడేస్తారు. ఊరికే వచ్చే థాంక్స్ మాత్రం వదులుకోవడం ఎందుకు.. ఎన్ని థాంక్స్ లు పోగుచేసుకుంటారో అనేది మీ ఇష్టం. ముందైతే మీరు ఛాలెంజ్ తీసుకోని, అందులో హాయిని అనుభూతి పొందండి. అది తప్పనిసరి.

Related posts