telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాత్రి 8 గంటల తర్వాత మందు బంద్!

MLC Elections 3 days closed Liquor shops

మందు బాబులకు రాజస్థాన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాత్రి 8 గంటల తర్వాత మద్యం అమ్మకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 8 గంటల తర్వాత కూడా మందు అమ్మితే వాళ్ల షాపులు సీల్ చేసి, లైసెన్సులు రద్దు చేయండి అని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. చీఫ్ మినిస్టర్ ఆఫీస్‌లో సీనియర్ అధికారులతో సమావేశంలో గెహ్లాట్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

2008లోనూ అప్పటి మా ప్రభుత్వం ఇలాంటి విధానమే తీసుకొచ్చింది. రాత్రి 8 గంటల తర్వాత మద్యం అమ్మకపోవడం అన్నది సమాజానికి ఓ సానుకూల సందేశాన్ని ఇచ్చింది అని ఆయన చెప్పారు. ఇక మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారన్న సమాచారంతో అలాంటి వాళ్లపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణాను కూడా అరి కట్టాలని అధికారులకు అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు.

Related posts