• Home
  • వార్తలు
  • కోర్టులలో పేరుకు పోయిన కేసులు కొలిక్కి తెచ్చేదాకా… నో లీవ్.. : జస్టిస్ గగోయ్
రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

కోర్టులలో పేరుకు పోయిన కేసులు కొలిక్కి తెచ్చేదాకా… నో లీవ్.. : జస్టిస్ గగోయ్

no leave policy introduced in court also

భారత కోర్టులలో న్యాయశాస్త్రంలో లూప్ హోల్స్ అడ్డుపెట్టుకొని వాయిదాల మీద వాయిదాలు వేసి కుప్పలు తెప్పలుగా కేసులను పెండింగ్ లో పెట్టారు. అవి ఇప్పటికి ఉన్న న్యాయవాదులు అందరు రేయింబవళ్లు పని చేసినా ఆ కేసులు పూర్తికావు. అలా పెరిగిపోయాయి పెండింగ్ కేసులు. తాజాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జస్టిస్ గగోయ్ న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ కోర్టు పెండింగ్ కేసుల క్లియరెన్స్ కోసం పని దినాలలో సెలవలు తీసుకోరాదనే విధానాన్ని ప్రవేశపెట్టారు.

హైకోర్టులో న్యాయమూర్తులు పనిదినాలలో సెలవలు తీసుకోకుండా విధిగా విధులను నిర్వర్తించాలని చెప్పారు గగోయ్. కేసుల కేటాయింపులో కూడా గగోయ్ నూతన రోస్టర్ ను తీసుకువచ్చారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను తనతోపాటుగా తన తరవాతి సీనియర్ అంటే మదన్ బీ లోకూర్ నేతృత్వంలో బెంచ్ లు విచారణ చేపట్టాలని వారు నిర్ణయించారు. ప్రాధాన్యత, తక్షణ అవసరాలకు అనుగుణంగా కేసుల విచారణకు నూతన ప్రమాణాలను అనుసరించాలని గగోయ్ న్యాయవాదులకు సంకేతాలు పంపారు. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే కేసుల తక్షణ విచారణకు తీసుకోరాదని ఆయన కోరారు.

Related posts

2019 ఎన్నికల్లో జగన్ సీఎం అవుతాడా?

admin

అరవింద సమేత మూవీ ‘చిత్రాలు’…

chandra sekkhar

టీవీ సీరియళ్లపై మండిపడ్డ జేసి… ఏమైనా ప్రయోజనం ఉందా ? అంటూ సూటి ప్రశ్న

vimala t

Leave a Comment