People turn away, Congress gave Telangana

తెలంగాణకు అమిత్‌షా.. పైసా సాయం చేయలేదు: హరీశ్‌రావు

తెలంగాణకు అమిత్‌షా పైసా సాయం చేయలేదని హరీశ్‌రావు అన్నారు. 50 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా? అని ప్రశ్నించారు. బుధవారం గుర్రాలగొంది గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ అంటున్నారని, ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకు అన్యాయం జరగదా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ నేతలు అధికారం కోసం చంద్రబాబుతో కలిసి… తెలంగాణకు అన్యాయం చేస్తున్నందుకు ఓటేయ్యాలా? అని అన్నారు. కుర్చీ కోసం అన్ని పార్టీలు కలుస్తున్నాయని, అన్ని పార్టీలు కలిసి గుంపుగా వచ్చినా తాము సింగిల్‌గానే ఓడిస్తామని అన్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం సీట్లు కోసం కాంగ్రెస్ ముందు పొర్లు దండాలు పెడుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *