telugu navyamedia
news political Telangana

‘కూటమిని’ ఆదరించని గ్రేటర్ ఓటర్లు..14 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం

No Effect in Mahakutami Greater HYD

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహాకూటమి ఎత్తులు ఫలించలేదు. కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌లు కూటమిగా ఏర్పడి టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు. మంగళవారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నగర ప్రజలు ఏకపక్షంగా తీర్పునిస్తూ 14 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు భారీ మెజారిటీతో విజయం కట్టబెట్టారు. ఎంఐఎం పాతబస్తీలో మళ్లీ 7 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్‌ ఎల్బీనగర్, మహేశ్వరం, బీజేపీ ఒక్క గోషామహల్‌తో సరిపెట్టుకున్నాయి.

గోషామహల్‌ బరిలోకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి ముఖేష్‌గౌడ్‌ మూడో స్థానంతోనే సరిపెట్టుకోగా, కంటోన్మెంట్‌ నుంచి పోటీచేసిన మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఎల్బీనగర్‌లో సుధీర్‌రెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. తెలంగాణ జనసమితి మల్కాజిగిరి, అంబర్‌పేటలలో డిపాజిట్లు కోల్పోయారు.

టీడీపీకి తెలంగాణలో ఇంకా బలముందని, ఆంధ్ర ఓటర్లు ఆదరిస్తారని, ఆ పార్టీ నాయకులు భావించారు. కానీ వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. శివారు రంగారెడ్డి నియోజకవర్గాల్ని కలుపుకొని ఉండే హైదరాబాద్‌ మహానగరంలో కూటమి ప్రభావం కనిపించలేదు. ఇక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు సుహాసిని, ఆనంద్‌ ప్రసాద్‌లు కనీస పోటీ సైతం ఇవ్వలేకపోయారు.



Related posts

జగన్ కు .. భారీగా సెక్యూరిటీ పెంచిన కేంద్రం..

vimala p

సికింద్రాబాద్‌ రైల్వేలో నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం

vimala p

పోటీ చేసే స్థానాలపై క్లారీటీ ఇచ్చిన రాహుల్

vimala p