telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ : … తాగునీటి కష్టాలు..

no drinking water supply for 2 days ghmc

ఈ నెల 26వ తేదీ నుంచి మంచి నీటి సరఫరా నిలిచిపోతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఆగిపోనుందని జలమండలి అధికారులు తెలిపారు. ఈ నెల 26, 27వ తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, 28, 29 తేదీల్లో మరికొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు వెల్లడించారు. గండిపేట నుంచి అసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌బెడ్‌కు నీటి తరలింపులో పైపులైన్‌ కాలువ మరమ్మతులు, అసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌బెడ్‌ క్లీనింగ్‌ దృష్ట్యా 26, 27 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని చెప్పారు. గండిపేట జలాశయం నుంచి తాగునీరు సరఫరా అయ్యే నీటిని నిలిపివేయనున్నారు. కృష్ణా పైపులై లీకేజీ పైపులైనుకు మరమ్మతులు చేస్తున్న దృష్టా ఈ నెల 28 తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. ఫలితంగా అలియాబాద్, మిరాలాం, కిషన్ భాగ్, రియాసత్ నగర్, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, అస్మాన్ ఘాడ్, చంచల్ గూడ, యాకుత్ పుర, మలక్ పేట్, మూసారాంబాగ్‌, బొగ్గులకుంట, అఫ్జల్ గంజ్, హిందినగర్, నారాయణ గూడ, అడిక్ మెట్, శివం, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్‌ లకు తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. ఈ విషయంలో జలమండలి అధికారులకు సహకరించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాకతీయ నగర్‌, సాలార్జంగ్‌ కాలనీ, పార్ట్‌ పద్మనాభ నగర్‌, కుందర్‌బాగ్‌, వినయ్‌ నగర్‌ కాలనీ, చింతల్‌బస్తీ, హుమాయున్‌ నగర్‌, సయ్యద్‌ నగర్‌, ఏసీ గార్డ్స్‌, ఖైరతాబాద్‌, మల్లేపల్లి, బోయిగూడ కమాన్‌, అజంపుర, నాంపల్లి, దేవిబాగ్‌, అఫ్జల్‌ సాగర్‌, సీతారాంబాగ్‌, హబీబ్‌నగర్‌, ఎస్‌ఆర్‌టీ, జవహర్‌నగర్‌, పీఎన్‌టీ కాలనీ, సాయన్న గల్లీ, అశోక్‌నగర్‌, జ్యోతి నగర్‌, వినాయక్‌ నగర్‌, మైసమ్మ బండ, ఎంసీహెచ్‌ క్వార్టర్స్‌, సెక్రటేరియట్‌, రెడ్‌హిల్స్‌, హిందీ నగర్‌, గోడెకీకబర్‌, గన్‌ఫౌండ్రీ, దోమలగూడ, లక్డీకపూల్‌, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి ప్రాంతాలకు అంతరాయం ఏర్పడుతుంది.అదే విధంగా కృష్టా మొదటి దశ పైపుకు లీకేజీలు ఏర్పడడంతో నగరంలోని మరి కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపోనున్నది. బండ్లగూడ వద్ద హైదరాబాద్‌కు కృష్ణానది నుంచి మంచినీటిని తరలిస్తున్న కృష్ణా మొదటి దశ పైపులైను భారీ లీకేజీ ఏర్పడింది.

Related posts